![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -295 లో... అనామిక- కళ్యాణ్ ల పెళ్లి అనంతరం ఇరు కుటుంబాలు దుగ్గిరాల ఇంటికి వస్తారు. పెళ్లి తర్వాత జరిగే తంతు మా ఇంట్లో జరపడం మా ఆచారమని అనామిక వాళ్ళ పేరెంట్స్ అంటారు. మా ఇంట్లో జరపడం మా ఆచారమని అంతే కాకుండా పూజ కూడా జరిపించలని ఇందిరాదేవి చెప్తుంది. సరేనని అనామిక పేరెంట్స్ అంటారు. ఆ తర్వాత అనామికని కళ్యాణ్ చేతిలో పెట్టి అప్పగింతలు జరిపించి వెళ్లిపోతు.. రాజ్ ని పక్కకు పిలిచి అనామిక పేరెంట్స్ మాట్లాడుతారు.
పెళ్లిలో అంత గొడవ జరిగింది.. ఆ కావ్య తన చెల్లిని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యలని అనుకుంది. అది కుదరలేదు కదా.. ఇంట్లో నా కూతురుకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని అనామిక నాన్న అంటాడు. మీరు ఏం టెన్షన్ పడకండని వాళ్ళకి సర్ది చెప్పి రాజ్ వాళ్ళని పంపిస్తాడు. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి పెళ్లిలో జరిగిన గొడవ గురించి బాధపడుతుంటారు. అప్పుడే అప్పు గదిలో నుండి బయటకు వచ్చి సైకిల్ 'కీ' ఇవ్వు అని అప్పు అడుగుతుంది. ఎక్కడకి అని అన్నపూర్ణ అడుగుతుంది. చికెన్ తినాలని అనిపిస్తుంది. అందుకే తీసుకొని రావడానికి వెళ్తున్నాను.. అన్ని రెడీ చెయ్ అని అప్పు చెప్పి వెళ్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పు మొహంలో ఎలాంటి బాధ కన్పించడం లేదని అనుకుంటారు. మరొకవైపు అనామిక- కళ్యాణ్ లు ఇంట్లోకి వచ్చేటప్పుడు.. అనామిక, ధాన్యలక్ష్మి అన్న మాటలు గుర్తుకు చేసుకొని కావ్య బాధపడుతుంటుంది. అప్పుడే రాజ్ వచ్చి అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావని అంటాడు.
ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేస్తుంటారు. అపర్ణ , ధాన్యలక్ష్మి కలిసి కావ్యని పిలువకుండా వాళ్ళే వడ్డించుకుంటారు. కావ్య కర్రీ వెయ్యాలా అని ధాన్యలక్ష్మి ని అడిగితే ధాన్యలక్ష్మి చిరాకు పడుతుంది. ఏంటి ఎప్పుడు కావ్యని ఒక్క మాట కూడా అననివ్వవు.. ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావని రుద్రాణి అనగానే.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని, ఎవరినీ ఎక్కవ నమ్మోద్దని అర్థం అయిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా భోజనం చేస్తున్నప్పుడు ఆర్గుమెంట్ జరుగుతుంటే ఇందిరాదేవి తన ఇద్దరి కోడళ్ళపై కోప్పడుతుంది. కావ్యకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. వంట బాగా చేసావని మెచ్చుకుంటుంది. తరువాయి భాగంలో ప్రొద్దున లేచి అనామిక అందరికి కాఫీ చేసి తీసుకొని వస్తుంది. అందరూ కాఫీ తాగి ఇదేం కాఫీ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |